Sunday 15 November 2015

                            సమాధిలో 2000 ఏళ్ల నాటి చిత్రపటం!



బీజింగ్: ప్రముఖ చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ కు చెందిన 2000 సంవత్సరాల క్రితం నాటి చిత్రపటాన్ని గుర్తించినట్లు ఆ దేశ పురాతత్వ శాస్త్రవేత్తలు శనివారం ప్రకటించారు. చైనా తూర్పు ప్రాంతం జియాంగ్జిలోని ఓ సమాధిలో ఉన్న ఈ చిత్రపటం రెండు భాగాలుగా లభించింది. ఇందులో ఇద్దరు వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకరు కన్ఫ్యూషియస్ అయి ఉంటారని భావిస్తున్నారు.
చిత్రపటం మీద కన్ఫ్యూషియస్ తో పాటు అతని తండ్రి, ప్రియ శిష్యుని పేర్లు చైనా భాషలో రాసి ఉండడం తమ అభిప్రాయాలకు మరింత బలం చేకూర్చుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దృఢమైన చెక్కపై లక్కతో పూతపూయబడి ఉన్నటువంటి ఈ చిత్రపటం 60 సెంటీమీటర్ల వెడల్పు, 80 సెంటీమీటర్ల పొడవుతో లభించింది. అలాగే పురాతన చిత్రపటం మీద కన్ఫ్యూషియస్ జీవిత చరిత్రను క్లుప్తంగా గమనించినట్లు ఈ తవ్వకాలకు సంబంధించిన డిప్యూటీ ఛీఫ్ జంగ్ జోంగ్లి వెల్లడించారు. అయితే ఇందుకు మరిన్ని ఆధారాలు కావాల్సి ఉందని తెలిపారు.
చైనా రాజవంశీయులకు చెందిన యువరాజు  సమాధి ఇది అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమాధిలో కన్ఫ్యూషియస్ చిత్రపటం ఎందుకు ఉంది అనేది మిస్టరీగా మారింది. చైనా చరిత్రలో కన్ఫ్యూషియస్ కు ప్రముఖ స్థానం కలదు. చైనా వారసత్వ సంస్కృతికి కన్ఫ్యూషియస్ ను ప్రతీక గా భావిస్తారు. ఈ పరిశోధనతో చైనా పురాతన చరిత్రకు సంబంధించి మరింత స్సష్టమైన సమాచారం అందనుందని శాస్త్రేవేత్తలు ప్రకటించారు.
                              తెలుగు ప్రజానికానికి నా వంతు సహాయ పడాలనే కోరికతో ఈ నా చిరు ప్రయత్నం


 ఈ పేజి నడపటానికి ముక్య ఉధెసమ్ మన సమాజం లో జరిగే ప్రతి ఒక్క విషయాన్నీ అందరికి తెలియజేయటమే .
 సమాజం లో జరిగే ప్రతి ఒక్క విషయం " రాజకీయం , సినిమా , క్రీడా , ఆరోగ్యం " ఇలా ప్రతి ఒక్క విషయం గురించి తెలియ చేయటమే ఈ పేజి యొక్క ముక్య ఉద్ధెసమ్. అందరు ఆదరిస్తారని బావిస్తూ

                                                                                                                             మీ
                                                                                                                      శ్రీయోబీలాషి